అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం హానిమిరెడ్డి పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహంపై వెళ్తున్న తండ్రి, కొడుకును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కొడుకు సాయి (15) మృతి చెందాడు. తండ్రి శ్రీనివాసులుకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. తండ్రి, కొడుకులు వ్యవసాయ పనుల కోసం ద్విచక్రవాహంపై పొలానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
తండ్రి ఆసుపత్రిలో... కొడుకు అనంత లోకాలకు... - accident at eluppa
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం హానిమిరెడ్డి పల్లిలో విషాదం నెలకొంది. తండ్రీకొడుకు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కొడుకు మృతి చెందగా తండ్రి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

హానిమిరెడ్డి పల్లి వద్ద రోడ్డు ప్రమాదం