అనంతపురం జిల్లా గుత్తి మండలం గాజులపల్లి గ్రామంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. జిల్లా ఎస్పీ ఏసుబాబు ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో 5 వేల లీటర్ల నాటు సారా బెల్లం ఊటను ధ్వంసం చేసి... ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. నాటుసారా అక్రమంగా నిలువ ఉంచినా, తయారుచేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు పోలీసులు హెచ్చరించారు.
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు...ఇద్దరు అరెస్ట్ - గుత్తి మండలం తాజా వార్తలు
అనంతపురం జిల్లా నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా చేసిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.

police rides on natusara bases in gutti ananathapur