అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు గ్రామ సమీపంలోని కొండ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. దాదాపు 4 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి.. సారా తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గుత్తి ఎస్సై ఇబ్రహీం తెలిపారు. ఎవరైనా నాటుసారా తయారు చేసినా.., అక్రమంగా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడి.. ఇద్దరి అరెస్టు - ananthapuram crime news
అనంతపురం జిల్లా గుత్తిలోని కొండ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. 4 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి.. తయారీదారులను అరెస్టు చేశారు.

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడి.. ఇద్దరి అరెస్టు