అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని సాయినగర్ లో ఉన్న కస్తూర్భా బాలికల పాఠశాలలో.. క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న కాలనీ ప్రజలు.. పాఠశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జనావసాల్లో క్వారంటైన్ కేంద్రం వద్దు అంటూ ఆందోళన చేశారు. పాఠశాల గేటుకు తాళాలు వేశారు.