అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని వరలక్ష్మి సినిమా థియేటర్ సమీపంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. భవన నిర్మాణ పనులు చేస్తున్న మేస్త్రి ఆంజనేయులు... విద్యుదాఘాతానికి గురయ్యాడు. పనుల్లో ఉండగా... సమీపంలో కరెంటు తీగలు తగిలి చనిపోయాడు. ఆయనను అనంతపురం గ్రామీణ మండలం కృష్ణమరెడ్డి పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి - అనంతపురం జిల్లా ధర్మవరం
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి చనిపోయాడు. భవన నిర్మాణ పనిచేస్తుండగా సమీపంలో కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి