అనంతపురం జిల్లా తలుపుల మండలం కుటాగుళ్ల గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పర్యటించారు. వ్యవసాయ శాఖ డీఆర్సీపీడీ మద్దిలేటి , ఏడీఏ పద్మాలత, ఏవో శేఖర్ రెడ్డి , శాస్త్రవేత్త వెంకట రమణ పంట పొలాలను పరిశీలించారు. చాలా ప్రాంతాల్లో వేరుశనగ పంటకు తెగుళ్లు వ్యాపిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం రైతు భరోసా కేంద్రంలో రైతులకు ఎరువులను ఎలా బుక్ చేసుకోవాలి, డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పించారు.
వేరుశనగ పంటను పరిశీలించిన అధికారులు - అనంతపురంలో వేరుశనగ పంట
అనంతపురం జిల్లా తలుపుల మండలం కుటాగుళ్ల గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు పర్యటించారు. వేరుశనగ పంటను పరిశీలించారు.

వేరుశనగ పంటను పరిశీలించిన అధికారులు
ఇదీ చదవండి: కుక్కల బాధ భరించలేక పోలీస్స్టేషన్ మెట్లెక్కిన మహిళలు