జీవితంలో చివరి మజిలీ అయిన చావు తర్వాత పూడ్చడానికి ప్రశాంతమైన వాతావరణం కల్పించి... శ్మశానాలను అభివృద్ధి చేసేందుకు తన నిధులన్నీ కేటాయిస్తానని అనంతపురం పార్లమెంట్ సభ్యుడు రంగయ్య తెలిపారు. కళ్యాణదుర్గంలో నిర్వహించిన పాస్టర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియెషన్ కార్యక్రమానికి, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సమయంలో ప్రార్థనలు చేయటంతో తనకు మంచి జరిగిందని.... తాను తరచుగా కుటుంబ సభ్యులతో కలిసి చర్చిలకు వెళ్తున్నట్లు ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డి తెలిపారు.
'శ్మశానాల అభివృద్ధికి నిధులు: ఎంపీ రంగయ్య'
తన నిధులన్నీ పేదవారి శ్మశానాల అభివృద్ధికి మళ్లీస్తానని అనంతపురం పార్లమెంట్ సభ్యుడు రంగయ్య స్పష్టం చేశారు. కళ్యాణదుర్గంలో నిర్వహించిన పాస్టర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియెషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'స్మశానాల అభివృద్ధికి నిధులు కేటాయింపు... ఎంపీ తలారి రంగయ్య'