గుత్తి మండలంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నాగసముద్రం నుంచి గుత్తి వెళ్లే రహదారి పక్కన ఉన్న తాటి చెట్టుపై పిడుగు పడింది.
మండలంలోని మల్లేనిపల్లి, నాగసముద్రం, బ్రహ్మణపల్లి, ఎర్రగుడి గ్రామాల్లో భారీ వృక్షాలు నేల కూలాయి. ఫలితంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.