Madakasira Branch Canal Works by Neglect YSRCP Government :మడకశిర బ్రాంచి కెనాల్ పనులను తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేసి చెరువులన్నింటికీ కృష్ణా జలాలు (Krishna Waters to all Ponds) అందిస్తాదని 2019 మార్చి 30న ఎన్నికల ప్రచారంలో భాగంగా మడకశిరలో నిర్వహించిన రోడ్డు షో లో జగన్ ఘనంగా ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా మడకశిర బ్రాంచి కాలువ పనులను పూర్తి చేయలేదు. ఇప్పటికే తవ్విన కాలువలు మట్టితో పూడిపోతున్నాయి. కొన్ని వంతెనలు నిర్మిస్తే చాలు చెరువులకు నీళ్లివ్వొచ్చు. ప్రధాన కాలువను పక్కన పెట్టి కొత్తగా బైపాస్ కాలువ అంటూ పనులు అప్పగించారు. దీనివల్ల ఉపయోగం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
YSRCP Government Spend Funds on Bypass Canal : శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా వరద జలాలను కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు తరలించే హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగానే మడకశిర బ్రాంచి కాలువ నిర్మాణం చేపట్టారు. హంద్రీనీవా రెండో దశలో 26 టీఎంసీలను తరలించాలనేది ప్రధాన ఉద్దేశం. తెలుగుదేశం హయాంలో మడకశిర వరకు కాలువ పనులు పూర్తి చేసి హరేసముద్రం చెరువుకు నీరందించారు.
Budameru Canal: దశాబ్దాలుగా దుర్వాసనతో జీవనం.. ఇంకెప్పుడు బాగుపడతాయి సార్ వాళ్ల జీవితాలు..?
2019లో ప్రభుత్వం మారిపోవడంతో పనులు నిలిచిపోయాయి. అసంపూర్తి పనులను పూర్తి చేస్తే వందల చెరువులకు నీరందుతుంది. జగన్ సర్కారుకు ఆ మాత్రం చిత్తశుద్ధి కూడా లేదు.కాలువలు రూపు కోల్పోయి చెట్లు మొలిచాయి. గుత్తేదారులకు 7 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పనులు నిలిపేశారు. మిగిలిన పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా పట్టించుకోవటం లేదు.