మన రాష్ట్రానికి చెందినవారైనా ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు అంటున్నారు. ఇదీ అనంతపురం జిల్లా మడకశిరలో జరిగిన సంఘటన. మడకశిర నియోజకవర్గం బెంగళూరు మహా నగరానికి సమీపంలో ఉంది. బెంగళూరుకు ఉపాధి కోసమని అనంతపురం నుంచే కాకుండా, బళ్లారి, గుల్బర్గా, ప్రాంతాల నుంచి వలసలు వెళ్తారు.
బెంగళూరు నుంచి గుల్బర్గా వయా మడకశిర
వారి రాష్ట్రానికి వెళ్లటానికి రాష్ట్రం నుంచి ట్రాక్టర్లపై కిక్కిరిసి వెళ్తున్నారు... దేశమంతా లాక్డౌన్ అమలవుతున్న వేళ రాత్రంతా ప్రయాణిస్తున్న వారిని ఏ అధికారి ప్రశ్నించలేదు. పక్కరోడ్డు మీదకు వెళ్తేనే లాఠీకి పని చెప్తున్నారు పోలీసులు.. మరి వీరి విషయంలో ఎందుకంత ఉదాసీనత?
దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఉపాధికి బెంగళూరు వెళ్లిన అనంతపురం వాసులు తిరిగి వచ్చేశారు. అయితే, కర్ణాటక రాష్ట్రానికి చెందిన బళ్లారి, గుల్బర్గా ఇతర జిల్లాలకు చెందిన వారు స్వస్థలాలకు వెళ్లేందుకు మడకశిర మీదుగా ట్రాక్టర్లలో కిక్కిరిసి వెళ్తున్నారు. ట్రాక్టర్లో డిజిల్ కోసమని మడకశిర నడిబొడ్డున ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఆపారు. లాక్డౌన్ సందర్భంగా తమ స్వస్థలాలకు వెళ్తున్నామనీ, నిన్న రాత్రి నుంచి ప్రయాణం చేస్తున్నట్లు వలస కూలీలు తెలిపారు. ట్రాక్టర్లపై కిక్కిరిసి పదుల సంఖ్యలో వెళ్తున్నా అధికారులు ప్రశ్నించకపోవటం గమనార్హం.
ఇదీ చదవండి:మార్కింగ్లు వేసినా మార్పు రాలేదు...!