కరోన వ్యాప్తి చెందుతున్న కారణంగా నగరాల్లో ఉపాధి పొందుతున్న గ్రామ ప్రజలు తిరిగి వారి స్వగ్రామాలకు వలస బాట పట్టారు. ఈ నేపథ్యంలో మడకశిర మండలం రేకులకుంట అనంతపురం గ్రామంలోని సచివాలయాన్ని జేసీ-2 సిరి సందర్శించారు. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి లేదని ఏ ఒక్కరూ చింతించాల్సిన అవసరం లేదన్న ఆమె ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు.
'కుటుంబంలో ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు ఇవ్వండి' - job cards latest news update
కుటుంబంలో ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు ఇవ్వాలని అనంతపురం జిల్లా జేసీ ఆదేశించారు. కరోనా లాక్డౌన్ కారణంగా స్వగ్రామాలకు వలస బాట పట్టినవారు ఉపాధి లేదు అని నిరాశ పడకుండా.. స్వస్ధలాల్లోనే పనులు చేసుకుంటూ సంతోషంగా జీవించాలని జేసీ-2 సిరి పేర్కొన్నారు.
సచివాలయం సందర్శించిన జేసీ2 సిరి