గుంతకల్లుకు రైల్వే జోన్ ప్రకటించాలి విశాఖకు రైల్వేజోన్ కేటాయించిన తీరుపై అనంతపురంలో విద్యార్థి సంఘాల నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. రాయలసీమ పరిధిలోని గుంతకల్లులో జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో న్యాయప్రకారం అప్పీల్ చేసినా.. కేంద్రం పట్టించుకోలేదని వాపోయారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రం అర్ధంతరంగా విశాఖ జోన్ ప్రకటన చేసిందని ఆరోపించారు. రాష్ట్ర రాజకీయ నాయకులు ఇప్పటికైనా స్పందించి గుంతకల్లును రైల్వే జోన్‌గా ప్రకటించేవరకు పోరాడాలన్నారు. పోలీసులు ధర్నాను అడ్డుకుని విద్యార్థి నాయకులను స్టేషన్‌కు తరలించారు.