Gang Rape SC Woman: స్నానం చేస్తుండగా వీడియో తీసి.. ఒంటరి మహిళపై ఏడాదిగా ఆరుగురు అత్యాచారం Gang Rape SC Woman తనపై ఏడాదిగా ఆరుగురు అత్యాచారం చేస్తున్నారని ఓ ఒంటరి ఎస్సీ మహిళ చేసిన ఫిర్యాదు ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. నెల రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ మహిళ ఆరోపించింది. తనను బెదిరించి, పలుమార్లు అత్యాతారం చేశారని ఆ మహిళ చెప్తుండగా.. పోలీసులు మాత్రం ఇందుకు భిన్నంగా చెప్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇది తీవ్ర చర్చకు దారి తీసింది.
వివరాలు ఇలా ఉన్నాయి: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎస్సీ ఒంటరి మహిళపై.. అదే ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు.. బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం క్రితం స్నానం చేస్తుండగా.. తనపై దాడి చేసి బలవంతంగా అత్యాచారం చేశారని చెప్పారు.
Man Blackmail Minor Girl and Raped బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం.. గర్భం దాల్చటంతో వెలుగులోకి
వీడియో తీసి అత్యాచారం చేశారంటూ..: అత్యాచార ఘటనలు వీడియో తీసి.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామని బెదిరించి తరచూ అత్యాచారానికి పాల్పడుతున్నారని.. బాధితురాలు కన్నీరు పెట్టుకుంది. నెల రోజుల క్రితం ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోలేదని వాపోయింది. అనంతపురం ఎస్పీ కార్యాలయానికి.. ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులతో కలిసి బాధిత మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. ఎస్పీ కార్యాలయం ఎదుట కూడా కాసేపు గొందరగోళం నెలకొంది. కళ్యాణదుర్గం ఎస్సై అడ్డుకోవడానికి యత్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.
Woman Complained on SI పెళ్లి చేసుకుంటానని మోసం చేశారంటూ.. ఎస్సైపై ఫిర్యాదు
రాజకీయ అండతోనే అంటూ ఆరోపణ: ఎస్పీ కార్యాలయం ఎదుట కళ్యాణదుర్గం ఎస్సై సుధాకర్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో స్వల్ప వాగ్వాదం జరిగింది. రాజకీయ అండతోనే.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు, సంఘ నేతలు ఆరోపించారు. నిందితులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని.. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఘటనపై మండిపడుతున్న ఎస్సీ, ఎస్టీ నాయకులు: సామూహిక అత్యాచారం అంటూ బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో.. ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. నెల రోజుల క్రితం ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా ఎస్సై నిర్లక్ష్యం వహించడమే కాకుండా.. ఇవాళ ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వస్తే అడ్డుకోవడం ఏంటని ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
minor: ప్రేమించానంటూ 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..
పోలీసులు మాటలు మరోలా: అయితే దీనిపై పోలీసులు చెప్తున్న వివరాలు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. బాధితురాలు ఈ విషయమై అయిదు రోజుల క్రితం ఫిర్యాదు చేసిందని పోలీసులు అంటున్నారు. అదే విధంగా దీనిని గ్యాంగ్ రేప్ కాదని.. ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని 10వ తేదీన ఫిర్యాదు చేసిందని చెప్తున్నారు. బాధిత మహిళ ఫిర్యాదుపై సంబంధిత ఎస్సై విచారించే పనిలోనే ఉన్నారని అన్నారు. సామూహిక అత్యాచారం జరగలేదని.. అలా జరిగి ఉంటే విచారించి బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్వీ శ్రీనివాసులు స్పష్టం చేశారు.
మైనర్పై రెండేళ్లుగా రేప్.. దోషికి 142ఏళ్ల శిక్ష.. పోక్సో కోర్టు సంచలన తీర్పు