అనంతపురం జిల్లా తనకల్లు మండలం నల్లగుట్లపల్లి ప్రభుత్వ ఉన్నతపాఠశాల ఆవరణలో జూదం ఆడుతున్న 14మందిని తనకల్లు పోలీసులు అరెస్టు చేశారు. జూదం ఆడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు పాఠశాలలోకి ప్రవేశించారు. వారి రాకను గుర్తించి కొందరు పారిపోగా ... మరికొందరు పోలీసులకు చిక్కారు. వారిని విడిపించేందుకు ఇటీవల ఎన్నికైన ఓ ప్రజాప్రతినిధి... పోలీసుస్టేషన్ ముందు మహిళలతో ఆందోళనలు చేపట్టేందుకు ప్రయత్నించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. పోలీసు ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ మధు స్ఫష్టం చేశారు.
పాఠశాలలో జూదం.. 14 మంది అరెస్ట్ - అనంతపురం జిల్లా వార్తలు
అనంతపురం జిల్లా తనకల్లు మండలం నల్లగుట్లపల్లిలో జూదం ఆడుతున్న 14మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విడిపించేందుకు ఇటీవల ఎన్నికైన ఓ ప్రజాప్రతినిధి... పోలీసుస్టేషన్ ముందు మహిళలతో ఆందోళనలు చేపట్టేందుకు ప్రయత్నించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ మధు స్ఫష్టం చేశారు.

పాఠశాలలో జూదం