ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య - ananthapuram crime news

అతను 5 ఎకరాల ఆసామి అయిన... అతన్ని అప్పులు రాకాసిలా వెంటాడాయి. సుమారు 4 లక్షలు వెచ్ఛంచి పత్తి పంటను సాగుచేసాడు. అనుకున్న రీతిలో దిగుబడి రాకపోవటంతో పురుగుల మందును మద్యంలో కలుపుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

By

Published : Nov 23, 2020, 6:23 PM IST

అప్పులు బాధ తాళలేక ఒక రైతు మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా పామిడి మండలంలో జరిగింది. పామిడి మండలం కొండాపురానికి చెందిన సుగునాధ అనే రైతు తనకున్న 5 ఎకరాల పొలంలో సుమారు 4 లక్షలు వెచ్ఛించి పత్తి పంటను సాగు చేశాడు. అధిక వర్షాలకు అనుకున్న రీతిలో పత్తి పంట దిగుబడి రాకపోవటంతో అప్పులు అధికమై కస్తుర్బా స్కూల్ ఆవరణలో ఆత్మహత్య చేసుకున్నాడు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.మృతుడికి భార్య, కుమారుడు ఉన్నాడు. పత్తి పంట కోసం తన తండ్రి సుమారుగా 5 లక్షలు అప్పుచేశాడని మృతుడి కుమారుడు సునీల్​ తెలిపాడు. పంట చేతికి రాకపోవటంతో అప్పుల భాధతో పురుగుల మందు తాగి చనిపోయాడని అన్నాడు. ఎలాగైనా ప్రభుత్వమే తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

రాజమహేంద్రవరంలో విషాదం...నలుగురు కుటుంబసభ్యుల ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details