ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు - Kalva Srinivaslu latest news

నివర్ తుపాన్ ప్రభావంతో అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలో వరద ముంపునకు గురైన వరిపంట పొలాలను మాజీ మంత్రి, తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు. పంట నష్టంపై రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

By

Published : Dec 1, 2020, 10:45 PM IST

ప్రకృతి కోపం.. పాలకుల శాపం రెండు కలిసి రైతులను నట్టేట ముంచి అప్పుల పాలు చేస్తున్నాయని మాజీ మంత్రి, తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలో నివర్ తుపాన్ ప్రభావంతో ముంపునకు గురైన పంటపొలాలను, మెులకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది రైతులు ఏదో రూపంలో నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది పంటలన్నీ బాగా పండుతాయని భావించిన రైతులకు నిరాశే మిగిలిందన్నారు.

వేరుశనగ, వరి పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఒడియార్ చెరువు కింద పంటలు సాగు చేసిన రైతులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. ఎక్కువ నీరు చెరువుకు వదలడంతో పంటలన్ని దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఖరీఫ్ లో రాష్ట్ర మంత్రి శంకర్ నారాయణ బొమ్మనహాళ్ మండలం లోని శ్రీధర్గట్ట', ఉద్దేహళ్ ప్రాంతంలో ఆర్భాటంగా ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిరుపయోగంగా మారాయి అని మండిపడ్డారు.

ఇదీ చదవండి

సీఎం జగన్​పై 3 పిటిషన్లు: రెండింటిని కొట్టేసిన సుప్రీం

ABOUT THE AUTHOR

...view details