రొద్దంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మెుక్కజొన్న దగ్ధం - విద్యుత్ ప్రమాదంతో మెుక్కజొన్న దగ్ధం
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మొక్కజొన్న దగ్ధమైన ఘటన అనంతపురం జిల్లా గౌరాజుపల్లిలో జరిగింది. సుమారు రూ.50 వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు.

విద్యుత్ ప్రమాదంతో మెుక్కజొన్న దగ్ధం
అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని గౌరాజుపల్లి గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి రెండు ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేశాడు. పంట పూర్తవడంతో ఇటీవల మొక్కజొన్న కంకులు తొలగించి కళ్లంలో కుప్పగా వేశాడు. అయితే ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మొక్కజొన్నకు మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో రూ.50 వేలు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.