అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వ్యవసాయ సబ్ డివిజన్లో విత్తన వేరుశెనగ కోసం రైతులు బారులు తీరారు. కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో రాయితీతో కూడిన విత్తనాలు తీసుకునేందుకు రైతులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. స్థానిక అధికారులు, పోలీసులు సామాజిక దూరం పాటించాలని సూచనలిస్తున్నప్పటికీ రైతులు వేరుశెనగ బస్తాలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. వేరుశనగ విత్తన కోసం టోకెన్లు పొందిన రైతులు అందరికీ ఖచ్చితంగా వేరుశెనగ కాయలు అందిస్తామని ఏడీఏ మల్లికార్జున స్పష్టం చేశారు.
విత్తన వేరుశెనగ కోసం బారులు తీరిన రైతులు - anantapuram farmers latest news
కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో రాయితీపై అందించే విత్తనాలు తీసుకునేందుకు అన్నదాతలు బారులు తీరారు. స్థానిక అధికారులు, పోలీసులు సామాజిక దూరం పాటించాలని సూచనలిస్తున్నప్పటికీ రైతులు మాత్రం అవేవీ పట్టించుకో లేదు.

విత్తన వేరుశెనగ కోసం బారులు తీరిన రైతులు