అనంతపురం జిల్లా గుత్తి, పామిడి బ్యాంకుల వద్ద క్రాప్ లోన్ రెన్యువల్ కోసం.. ఆయా గ్రామాల రైతులు కొవిడ్ నిబంధనలను లెక్కచేయకుండా బారులు తీరారు. ఒక పక్క ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటే మరోపక్క రైతులు క్రాప్ లోన్ రెన్యువల్ కోసం బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. సామాజిక దూరం పాటించకుండా క్యూ లో నిలబడి అవస్థలు పడుతున్నారు. అక్కడున్న స్థానిక బ్యాంకు అధికారులు.. సామాజిక దూరం పాటించాలంటూ మొరపెట్టుకుంటున్నా.. రైతులు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు.. బ్యాంకుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
బ్యాంకుల వద్ద కరోనా నిబంధనలు పాటించని రైతులు - farmers are not taking corona preventive steps at banks in gutti
అనంతపురం జిల్లా గుత్తి, పామిడి బ్యాంకుల వద్ద క్రాప్ లోన్ రెన్యువల్ కోసం రైతులు బారులు తీరారు. కొవిడ్ నిబంధనలు లెక్కచేయకుండా బ్యాంకుల వద్ద రైతులు గుంపులు గుంపులుగా ఉంటున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

farmers are not taking corona preventive steps