కొన్నిచోట్ల నామినేషన్ స్వీకరణ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డుకు ఫయాజ్ బాను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఎన్నికల సిబ్బంది అభ్యర్థుల వివరాలను ప్రకటించారు. ఆ జాబితాలో ఫయాజ్ బాను పేరును వైకాపా అభ్యర్థిగా చూపారు. దీనిపై అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు.
స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్.. వైకాపా అభ్యర్థిగా జాబితాలో పేరు!
ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం అభ్యర్థి నిరసనకు దారి తీసిన ఘటన అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. స్వతంత్రంగా అభ్యర్థిగా నామ పత్రాలు సమర్పిస్తే వైకాపా అభ్యర్థిగా ప్రకటించారని ఫయాజ్ బాను ఆందోళన చేపట్టారు.
ఎన్నికల సిబ్బంది
TAGGED:
Anantapur District news