ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇతరత్రా అజెండాలు పక్కన పెట్టి కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ప్రత్యేక దృష్టి సారించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. చలో పల్లె బాట కార్యక్రమంలో భాగంగా అనంతపురం వడియన్పేట గ్రామంలో పర్యటించిన రామకృష్ణ, మాస్కులు పంపిణీ చేస్తూ.. కరోనాపై అవగాహన కల్పించారు.
'కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి'
కరోనా కష్టకాలాన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఆసరాగా తీసుకొని... ఫీజుల పేరిట లక్షల్లో వసూలు చేస్తున్నాయని సీపీఐ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పల్లె బాట కార్యక్రమంలో భాగంగా అనంతపురం విడయన్పేటలో పర్యటించిన ఆయన కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ముఖ్యమంత్రి చెప్తున్న మాటలకు, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన లేదని రామకృష్ణ ఆరోపించారు. నెలకి రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నా.. ఎక్కడా సరైన వసతులు కల్పించలేదని విమర్శించారు. వైద్యశాఖ మంత్రి ఏ జిల్లాకు వెళ్లినా.. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని గుర్తు చేశారు. కరోనా కాలాన్ని ఆసరాగా చేసుకొని.. ప్రైవేటు ఆసుపత్రులు లక్షలు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై ప్రత్యేక దృష్టి సారించి.. అన్ని పార్టీలతో ఐక్యంగా పని చేయాలని సూచించారు.
ఇదీ చదవండి:ఎద్దుల బండిని ఢీకొట్టిన బొలెరో... మహిళకు తీవ్ర గాయాలు