ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్రగాయాలు - పలారంలో వ్యక్తిపై ఎలుగుబంటి దాడి వార్తలు

ఎలుగుబంటి దాడిలో వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన అనంతపురం జిల్లా పలారంలో జరిగింది. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తమ గ్రామంలో చిరుతలు, ఎలుగుల సంచారం ఎక్కువగా ఉంటోందని గ్రామస్థులు అంటున్నారు.

bear attack on person
ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్రగాయాలు
author img

By

Published : Oct 30, 2020, 1:02 PM IST

అనంతపురం జిల్లా గుడిబండ మండలం పలారంలో ఎలుగుబంటి దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రఘు అనే వ్యక్తి తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లగా.. పొదల్లో దాగి ఉన్న ఎలుగు ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. ఈ ఘటనలో అతనికి గాయాలయ్యాయి. రఘు అరుపులతో స్థానికులు రాగా.. ఎలుగుబంటి అక్కడినుంచి పారిపోయింది. క్షతగాత్రుడిని గ్రామస్థులు ఆసుపత్రికి తరలించారు.

గతంలోనూ ఎలుగులు, చిరుత దాడిలో చాలా మంది మృతిచెందారని స్థానికులు అంటున్నారు. అడవి జంతువులతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details