ఇంటి వద్దకే సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా కదిరిలో ఫిబ్రవరి 1న సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పర్యవేక్షించారు. కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలీప్యాడ్ , ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని ఉన్నతాధికారులతో కలిసి.. పరిశీలించారు. ఆర్డీవో వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డీఎస్పీ భవ్యకిశోర్, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు.
ఇంటికే సరకుల పంపిణీ.. ప్రారంభోత్సవానికి జోరుగా ఏర్పాట్లు - కదిరిలో సీఎం పర్యటన వార్తలు
ఫిబ్రవరి 1న అనంతపురం జిల్లా కదిరిలో ఇంటికే సరకుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యే, ఇతర ఉన్నతాధికారులు స్థల పరిశీలన చేశారు.

ఇంటివద్దకే సరకులు పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు