అనంతపురంలో సీపీఎం, అంగన్వాడి యూనియన్ల ధర్నా
చట్టానికి విరుద్ధంగా అంగన్వాడి ఉద్యోగ నియామాకాలు జరుపుతున్నారంటూ అనంతపురంలో సీపీఎం, అంగన్వాడి యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు.
అనంతపురంలో సీపీఎం, అంగన్వాడి యూనియన్ నాయకులు ధర్నా చేపట్టారు. చట్టానికి విరుద్దంగా ఉద్యోగ నియామాకాలు జరుపుతున్నారని వారు ఆరోపించారు. సీనియార్టీ ప్రకారం పదోన్నతిలో ఉన్న ఆయాలకు నియామకం కల్పించకుండా కొత్త వారిని చేర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అంబేడ్కర్ భవన్ లో నియమాకాలు చేపడుతున్న అధికారులను వారు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువురికి సర్దిచెప్పారు. దీనిపై అధికారులు పునరాలోచించి చట్టప్రకారం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.
ఇదీ చదవండి