వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే అనంతపురం జిల్లా రైతులను నకిలీ విత్తనాలు మరింత కష్టాల్లో నెడుతున్నాయి. నాసిరకం విత్తనాల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారు. కళ్యాణదుర్గం వ్యవసాయ సబ్ డివిజన్‌కు చెందిన ఓ రైతు టమాట పంటను సాగుచేశాడు. పంట ఏపుగా ఎదిగినా కాపు మాత్రం రాలేదు. నకిలీ విత్తనాలు సాగుచేశానని తెలుసుకున్న రైతు చేసేదేమీ లేక పంటను గొర్రెల మంద వారికి అప్పగించాడు. నాసిరకం విత్తనాలతో లక్షలాది రూపాయలు నష్టపోయిన తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు న్యాయం చేస్తారంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.
నకిలీ వ్యథ... గొర్రెలకు టమాట పంట
వర్షాభావ పరిస్థితులతో పోరాడే అనంత రైతన్నకు నాసిరకం విత్తనాలు మరిన్ని చిక్కులు తెస్తున్నాయి. లక్షలు పెట్టి సాగుచేసిన పంటలు కాపుకాయక... గొర్రెల మందలకు అమ్ముకునే పరిస్థితులు వస్తున్నాయని అన్నదాత ఆవేదన చెందుతున్నాడు.
నాసిరకం విత్తనాలతో రైతన్నకు తప్పని తంటాలు
ఇదీ చదవండి :సీఎం జగన్ నివాసం వద్ద విహంగ పహారా