ఓవైపు కరోనా, మరోవైపు లాక్‌డౌన్‌తో చీనీ రైతులు కుదేలయ్యారు. రవాణా వ్యవస్థ స్తంభించింది. ధరలు పూర్తిగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపింది. అనంతపురం జిల్లా మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో ఉద్యానశాఖ సహకారంతో ఆయా మార్కెట్ యార్డుల పరిధిలోని యార్డు కార్యదర్శులు మే ప్రారంభంలో చీనీకాయల కొనుగోలు ప్రారంభించారు. ఉద్యానశాఖ చీనీ రైతులను గుర్తించి సాగు ధ్రువీకరణపత్రం జారీ చేయడంతో పాటు రవాణా వాహనాలకు అనుమతి పత్రాలు మంజూరు చేశారు.
క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడతామని జిల్లా అధికారులు ఎంత మొత్తుకున్నా రాష్ట్ర ప్రభుత్వం వినలేదు. తీవ్ర ఒత్తిడి చేసింది. టన్ను ధర రూ.10 వేలు నిర్ణయించి పంటను కొనుగోలు చేయించారు. మొత్తం 163 మంది రైతులతో రూ.1.52 కోట్ల విలువైన 1,513 టన్నుల చీనీకాయలను కొనుగోలు చేశారు. లారీలు, ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని మార్కెట్‌యార్డులకు రవాణా చేసి అమ్మించారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఖాతాలకు సొమ్ము జమ చేసినట్లు సమాచారం. వాహనాలకు అద్దెలు చెల్లించిన ఉన్నతాధికారులు, తమకు మాత్రం సొమ్ము చెల్లించకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటను కొన్నారు.. అమ్ముకున్నారు.. వచ్చిన సొమ్ము చెల్లించకుండా ఎందుకు సాకులు చెబుతున్నారని ప్రశ్నిస్తున్నారు. రైతులతో మాట పడాల్సి వస్తోందని ఉద్యాన, మార్కెటింగ్‌శాఖ అధికారులు వాపోతున్నారు.
40 రోజులు గడిచిపోయింది