ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కానిస్టేబుల్​ ఉద్యోగాల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: ఎస్పీ ఫక్కీరప్ప - నేటి తాజా వార్తలు

AP Constable : రాష్ట్రంలో కానిస్టేబుల్​ రాత పరీక్షలను ఆదివారం నిర్వహించనున్నారు. ఈ పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. పటిష్ట భద్రత నడుమ ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు అధికారులు పలు సూచనలు చేశారు.

ఎస్పీ ఫక్కీరప్ప
ఎస్పీ ఫక్కీరప్ప

By

Published : Jan 21, 2023, 1:32 PM IST

Updated : Jan 21, 2023, 7:57 PM IST

AP Constable : కానిస్టేబుల్​ రాత పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. రాష్ట్రమంతటా ఈ పరీక్షలను నిర్వహించనుండగా.. అనంతపురం జిల్లా గుత్తిలో కేంద్రాలను ఎస్పీ ఫక్కీరప్ప పరిశీలించారు. గుత్తి పట్టణంలో పరీక్షకు పకడ్బంధిగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. పట్టణంలో ఏర్పాటు చేసిన అన్ని పరీక్ష కేంద్రాలను సందర్శించి.. భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.

ఆదివారం ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని అభ్యర్థులు 9గంటల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఉదయం ప్రారంభమైన పరీక్ష మధ్యహ్నం ఒంటిగంటకు ముగుస్తుందని తెలిపారు. అభ్యర్థులు మాల్​ ప్రాక్టిస్​, కాపీయింగ్​ తావివ్వకుడదాని పేర్కొన్నారు. కాపీయింగ్​ అవాంఛనీయ ఘటనలకు, అక్రమాలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ఈ సందర్శనలో భాగంగా పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, అనుసరించాల్సిన నిబంధనల వంటి పలు సూచనలను.. అధికారులకు, పోలీస్​ సిబ్బందికి తెలిపారు.

ఇవీ చదవండి :

Last Updated : Jan 21, 2023, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details