ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నావిక స్థావరం ప్రాజెక్టు దగ్గర 8 గ్రామాల నిర్వాసితుల ధర్నా - అనకాపల్లి జిల్లా తాజా వార్తలు

Expatriates Protest: అనకాపల్లి జిల్లా నావికా స్థావరం ప్రాజెక్టు వద్ద నిర్వాసితులు ధర్నాకు దిగారు. డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన ధర్నాలో ఎనిమిది గ్రామాలకు చెందిన నిర్వాసితులు పాల్గొన్నారు. నేవీ ప్రాజెక్టులోకి ఎలాంటి వాహనాలూ వెళ్లకుండా రహదారిపై నిలిచిపోయాయి. భారీస్థాయిలో పోలీసు బలగాలను మోహరించారు.

Expatriates Protest
నిర్వాసితుల ధర్నా

By

Published : Oct 31, 2022, 3:17 PM IST

Expatriates Protest: అనకాపల్లి జిల్లా రాంబిల్లి, ఎస్.రాయవరం మండలాల్లో సుమారు 4,500 ఎకరాల్లో నిర్మిస్తున్న నావిక స్థావరం ప్రాజెక్టు నిర్వాసితులు నేవీ ప్రధాన ద్వారం వద్ద ఈరోజు పెద్దఎత్తున ధర్నాకు దిగారు. నిర్వాసితులు తమ డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన ధర్నాలో ఎనిమిది గ్రామాల నిర్వాసితులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం ఏడు గంటలకే ఆందోళనకారులు నేవీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని బైఠాయించారు. నేవీ ప్రాజెక్టులోకి ఎలాంటి వాహనాలు వెళ్లకుండా రహదారిపై నిలిచిపోయాయి. ధర్నా వద్ద భారీ స్థాయిలో పోలీసు బలగాలు మోహరించారు.

నిర్వాసితుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details