ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS : ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM - ఏపీ ముఖ్యవార్తలు

ఏపీ ప్రధాన వార్తలు

AP TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Dec 28, 2022, 7:04 PM IST

  • సింగరాయకొండలో చంద్రబాబుకు ఘన స్వాగతం.. బైక్​ ర్యాలీగా కందుకూరుకు
    CHANDRABABU NELLORE TOUR : నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. కందుకూరులో జరగనున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి బహిరంగ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు. సింగరాయకొండ బైపాస్ నుంచి బైక్ ర్యాలీగా చంద్రబాబు కందుకూరుకు బయలుదేరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరు.. ఇప్పుడు అక్రమాలకు అడ్డా
    Illegal Activities in Gudivada: ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన పట్టణమది. ఇప్పుడు దౌర్జన్యాలు, దందాలు, అక్రమాలు, కబ్జాలకు అడ్డాగా మారింది. అక్కడ ప్రజాప్రతినిధి మారలేదు. కానీ ప్రభుత్వం మారింది. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మూడున్నరేళ్లుగా చట్టవ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోయి.. అధికార పార్టీ రౌడీయిజానికి, గూండాయిజానికి కేంద్రంగా మారింది. రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న ఆ నియోజకవర్గమే గుడివాడ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పింఛన్​ లబ్ధిదారుల సంఖ్య తగ్గించాలనుకోవడం సరికాదు: పవన్​
    Jana Sena Pawan Kalyan is letter to CM Jagan: రాష్ట్రంలో సామాజిక పింఛన్లు తొలిగించేందుకు.. వైసీపీ ప్రభుత్వం చూపిస్తున్న కారణాలు సమంజసంగా లేవని జనసేన అధినేత పవన్​ కల్యాణ్ ఆరోపించారు. ​పింఛన్లు తొలిగింపుపై పునరాలోచించాలని పవన్​ సీఎం జగన్​కు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు అడుగుతాం: ఆనం
    MLA ANAM SESATIONAL COMMENTS : రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా రాపూరులో ఏర్పాటు చేసిన వాలంటీర్లు, కన్వీనర్ల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఆవేదనకు గురయ్యారు. రోడ్ల గుంతలు పూడ్చలేకపోతున్నాం.. తాగడానికి నీళ్లు లేవని మండిపడ్డారు. నాలుగేళ్లలో ఏం పని చేశామని.. ప్రజలను ఓట్లు అడుగుతామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పోలీసుల అనుమతి లేకుండా నాయకులు పర్యటనకు వెళ్లాల్సిన పనేంటి?: డీజీపీ
    DGP ON CRIME RATE IN AP : ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం అనే పదమే.. పోలీసులకు సవాల్ అని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతలు ప్రేరేపించే వాళ్లదే తప్పని ఆయన అన్నారు. పోలీస్‌ అనుమతి లేకుండా నాయకులు పర్యటనకు వెళ్లాల్సిన పనేంటని నిలదీశారు. పెండింగ్ కేసుల సంఖ్య ఈ ఏడాది చాలా తగ్గిందని చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆ 40 రోజులు కీలకం'.. కరోనాపై కేంద్రం కీలక వ్యాఖ్యలు.. మాస్కులపై క్లారిటీ
    జనవరి నెలలో దేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది! కరోనా ఉద్ధృతి విషయంలో వచ్చే 40 రోజులు కీలకమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, అంతర్జాతీయ ప్రయాణికుల్లో 39 మందికి కరోనా పాజిటివ్​గా తేలిందని కేంద్రం తెలిపింది. అయితే, మాస్కులు తప్పనిసరి కాదని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మాజీ హోంమంత్రికి రిలీఫ్.. అవినీతి కేసులో ఏడాది తర్వాత జైలు నుంచి విడుదల
    మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఏడాదికి పైగా జైల్లో ఉన్న ఆయన.. తాజాగా విడుదలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పాత టీవీలను స్మార్ట్​టీవీలుగా మార్చుకునే ఛాన్స్.. రూ.1500లకే బంపర్ ఆఫర్
    ఎయిర్​టెల్ ఇండియా సరికొత్త ఆఫర్​తో ముందుకొచ్చింది. సాధారణ టీవీలను రూ.1500లకే స్మార్ట్ టీవీలుగా మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అదెలాగో తెలుసుకుందాం రండి..పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐసీసీ ర్యాంకింగ్స్​లో అదరగొట్టిన అశ్విన్​, శ్రేయస్​.. దూసుకెళ్లారుగా!
    ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్​ఇండియా ప్లేయర్స్​ రవిచంద్రన్‌ అశ్విన్‌, శ్రేయస్‌ అయ్యర్ అదరగొట్టారు. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'దళపతి 67'లో స్టార్ డైరెక్టర్​.. 'పొన్నియిన్ సెల్వెన్​ 2' రిలీజ్ డేట్​ ఫిక్స్​
    కొత్త మూవీ అప్డేట్స్​ వచ్చాయి. 'పొన్నియిన్ సెల్వెన్​ 2' రిలీజ్ డేట్​ను ప్రకటించారు మేకర్స్​. అలాగే విజయ్ 'దళపతి 67' సినిమాలో ఓ స్టార్ డైరెక్టర్​ నటించనున్నట్లు అధికార ప్రకటన వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details