ETV Bharat / science-and-technology
హ్యకర్లకు...దీటుగా మన సైబర్ పోలీసులు
ప్రభుత్వం సైబర్ నేరాలను తగ్గించే దిశగా ప్రయత్నిస్తోంది. మొన్న డ్రోన్ పహారా వ్యవస్థ..నేడు అత్యాధునిక ట్రాకింక్ విధానాలతో హ్యకర్ల ఆట కట్టించేందుకు పోలీసువ్యవస్థ సమాయత్తమవుతోంది.
నేటి ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతి చిన్న విషయానికీ ఏదో ఓ యాప్ సహాయం తీసుకునే స్థితిలో సమాజం ఉంది. ప్రజలు వేసే తప్పటడుగులు నేరగాళ్లకు ఆసరాగా మారుతున్నాయి. ఆఫర్లంటూ..ఉచితం అంటూ ఏవోవే మెయిల్స్ పంపి వ్యక్తిగత డేటాను దోచేస్తున్నారు. మనుషుల బలహీనతలు అడ్డు పెట్టుకొని బెదిరిస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరాలు 30 శాతం పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు సైబర్ నేరాలపై దృష్టి సారించారు. వాటిని అదుపు చేసేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆధారాలు సేకరించడం, డేటా రికవరీ, సమాచారాన్ని భద్రపర్చటం వంటి అంశాలపై సైబర్ క్రైమ్, సీఐడీ అధికారులకు తర్ఫీదునిస్తున్నారు.
దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం 6 రోజులు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎక్స్ ట్రాకింగ్ డిఫ్లెజస్, మాగ్నటిక్ ఎక్స్గ్యూమ్, బ్లాక్లైట్ పరికరాల పనితీరును వివరించారు. దర్యాప్తులో పురోగతికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.