ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

Curd: పెరుగు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

షడ్రసోపేత భోజనం చేసినా.. పెరుగన్నం తింటే కానీ అది పూర్తి కాదు. అలాంటి పెరుగు వల్ల ముఖ్యంగా మహిళలకు ఎన్ని లాభాలున్నాయో తెలుసా?!

curd
curd

By

Published : Jul 23, 2021, 11:15 AM IST

పెరుగు రుచికే కాదు, అందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించే వైద్య గుణాలను కలిగి ఉంది. ఇది అద్భుతమైన ప్రోబయోటిక్, జీర్ణక్రియను మెరుగుపరచటంతో పాటు, దంతాలు, ఎముకలకు పుష్టినిస్తుంది. పేగుల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పెరుగును పూతగానూ కేశాలపై వాడటం ఆనవాయితీ. అయినప్పటికీ, పెరుగు అధిక వినియోగం ఆరోగ్యానికి కొంత హాని కూడా కలిగిస్తుంది.

  • పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అది దంతపుష్టికి, ఎముకల దృఢత్వానికీ దోహద పడుతుంది. కీళ్ల నొప్పులను నివారిస్తుంది. ముప్పయి దాటిన స్త్రీలెందరో కాల్షియం లేమితో బాధ పడుతున్నారు. తగినంత పెరుగు తినక పోవడమే ఇందుకు కారణమని సర్వేలు చెబుతున్నాయి.
  • కొందరు చిన్నారులు పెరుగన్నం తినడానికి ఇష్టపడరు. పాలు తాగుతున్నారు లెమ్మని వదిలేయక అలవాటు చేయాలి. పాల కన్నా పెరుగే మంచిది.
  • పెరుగులో ఉన్న ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మెదడు చురుగ్గా పనిచేసేట్లు చేస్తాయి.
  • ఇందులో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్‌, పీచుపదార్థాలు ఆహారం త్వరగా జీర్ణమయ్యేట్లు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.పెరుగులోని మినరల్స్‌వల్ల శరీర ఉష్ణోగ్రత సమంగా ఉంటుంది.
  • పాలను జీర్ణం చేసుకోలేనివారు శరీరానికి అవసరమైన పోషకాలు, ప్రోటీన్​లు పొందడానికి పెరుగు తినవచ్చు.
  • పెరుగు గర్భిణీ స్త్రీలకు కూడా మంచిది. ఇది వారి రక్త కణాలు, హిమోగ్లోబిన్‌ను మంచి స్థాయిలో ఉంచడానికి సహాయపడుతుంది.
  • పెరుగు చర్మంపై జిడ్డును తగ్గించి, పొడి చర్మాన్ని మెరుగుపరచి మొటిమల సమస్యను పరిష్కరిస్తుంది. పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉండటం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి నల్ల మచ్చలను తగ్గిస్తుంది.
  • పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం వెంట్రుకలకు అవసరమైన పోషకాలు, ఖనిజాలను అందించడం వల్ల జుట్టు ఒత్తుగా, మెరుపుతో ఉంటుంది. అలాగే, సహజ కండిషనర్‌గా పనిచేయడం వల్ల అనేక హెయిర్ ప్యాక్‌లలో వాడతారు.
  • పెరుగు తినడంవల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఒత్తిడిని పెంచే హార్మోన్లను నియంత్రించే పోషకాలుంటాయి. పెరుగు తినడం వల్ల జీవక్రియ రేటూ మెరుగవుతుంది. పెరుగన్నం తింటే ఆకలి కూడా త్వరగా వేయదు. కొద్దిగా తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది.
  • నోటిపూతా, ఇన్‌ఫెక్షన్లూ కొందరిని తరచూ బాధిస్తుంటాయి. అలాంటి వారు పెరుగు తప్పనిసరిగా తినాలి. ఇందులో ఉండే విటమిన్‌ బి12 నోటిపూతను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

ఇదీ చదవండి :Corona Cases: భారత్​లో మరో 35 వేల కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details