కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్కు సిబ్బందిపై గడివేములకు చెందిన వైకాపా నేత బెదిరింపులకు పాల్పడ్డాడు. సోలార్ పార్కు కాంట్రాక్టు పనులు తమకే కేటాయించాలని తుపాకీతో బెదిరించాడు. వైకాపా నేత చర్యలకు భయభ్రాంతులైన సోలార్ పార్కు సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనపై విచారించిన పోలీసులు...వ్యక్తి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాంట్రాక్టు ఇవ్వాల్సిందే... తుపాకీతో వైకాపా నేత బెదిరింపు! - gun
కాంట్రాక్టు ఇవ్వాలని... లేదంటే ఊరుకునేది లేదని ఓ వైకాపా నేత తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడు. సోలార్ పార్కు కాంట్రాక్టు పనులు తమకే అప్పగించాలని సిబ్బందిని బెదిరిండం కలకలం రేపింది.

కాంట్రాక్టు పనులు కోసం వైకాపా నేత తుపాకీతో బెదిరింపులు