హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని మైత్రీ ఎన్‌క్లేవ్‌లో స్థిరాస్తి వ్యాపారి నర్సింగరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. సోమవారం కుటుంబ సమేతంగా నర్సింగరావు యాదాద్రి దర్శనానికి వెళ్లగా... దుండగులు ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. 50 తులాల బంగారు నగలు, 5 కిలోల వెండి, నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జవహర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
దైవ దర్శనానికి వెళ్తే... దొంగలు దోచుకెళ్లారు..! - crime
హైదరాబాద్‌లోని ఓ స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో భారీ చోరి జరిగింది. 50 తులాల బంగారు నగలు, 5 కిలోల వెండి, నగదును దొంగలు దోచుకెళ్లారు.

దైవ దర్శనానికి వెళ్తే... దొంగలు దోచుకెళ్లారు!
దైవ దర్శనానికి వెళ్తే... దొంగలు దోచుకెళ్లారు!
ఇవీ చూడండి: మహాఘనుడు... ఇంట్లోనే గంజాయి పెంచుతున్నాడు..!