ప్రేమ పెళ్లి చేసుకున్నారని సోదరి భర్తపై యువకుడు దాడి
ప్రేమ పెళ్లి చేసుకున్న సోదరి, ఆమె భర్త తమ కళ్లెదుటే హాయిగా తిరుగుతున్నారని వారిపై యువతి సోదరుడు హత్యాయత్నం చేశాడు. తన బావపై బీరు సీసాతో దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా బత్తలపల్లిలో జరిగింది.
అనంతపురం జిల్లా బత్తలపల్లిలో హత్యాయత్నం జరిగింది. తన సోదరి ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో బావపై యువతి సోదరుడు బీరు బాటిల్తో దాడి చేశాడు. తాడిమర్రి మండలం పిన్నదరి గ్రామానికి చెందిన గణేష్..బత్తలపల్లికి చెందిన వైష్ణవిని ప్రేమించి ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. బత్తులపల్లిలోనే ఇరువురు కాపురం పెట్టారు. ప్రేమ వివాహం చేసుకుని నా కళ్లెదుటే తిరుగుతారా అంటూ వైష్ణవి సోదరుడు బీరు బాటిల్ పగులకొట్టి పొడవటంతో గణేష్ కు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుడిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.