ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ఎస్‌ఆర్‌బీసీ కాల్వలో తల్లీ కుమారుడి అనుమానాస్పద మృతి - ఎస్​ఆర్​బీసీ కాలువలో తల్లి కుమారుడి మృతదేహాలు తాజా వార్తలు

అనుమానాస్పద రీతిలో తల్లీ కుమారుడు కాల్వలో పడి మృతి చెందిన విషాద ఘటన కర్నూలు జిల్లా నందవరంలో చోటు చేసుకుంది. ఆస్తి తగదాల కారణంగా బంధువులే హత్య చేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఎస్‌ఆర్‌బీసీ కాల్వలో తల్లి కుమారుడి అనుమానాస్పద మృతి
ఎస్‌ఆర్‌బీసీ కాల్వలో తల్లి కుమారుడి అనుమానాస్పద మృతి

By

Published : May 12, 2021, 1:58 PM IST

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరంలో విషాదం జరిగింది. నందవరంలో తల్లీ, కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎస్​ఆర్​బీసీ కాల్వలో మృతదేహాలు లభ్యమయ్యాయి. సరస్వతి, మధు శేఖర్​గా గుర్తించారు. ఆస్తి కోసం బంధువులే హత్య చేశారని సరస్వతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

పొలానికి వెళ్లి..

పొలం పనికి వెళ్లిన తల్లీ కుమారుడి మృత దేహాలను అవుకు మండలం లింగంబోడు సమీపంలోని ఎస్​ఆర్​బీసీ కాలువలో పోలీసులు గుర్తించారు. భర్త మద్దిలేటి లారీ డ్రైవర్​గా పని చేస్తుండగా, మరో చిన్న కుమారుడు మనీ వెంకట్ ఇంటి వద్దనే ఉన్నాడు. తల్లీ కుమారుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు.

ఇవీ చూడండి :కొవిడ్‌పై సాగాలి సమష్టి పోరు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details