ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

విద్యుత్​ షాక్​తో పశువులు మృతి... కన్నీరుమున్నీరవుతున్న రైతులు

విద్యుత్​ షాక్​తో పశువులు మృతి చెందిన ఘటన తెలంగాణలోని మహబూబాబాద్​ జిల్లా నర్సింహులపేట మండలం గోల్​బోడ్కతండా శివారులోని చర్లచంద్రుతండాలో జరిగింది. వ్యవసాయానికి ఆసరా ఉన్న పశువులు చనిపోవటంతో రైతులు కన్నీమున్నీరయ్యారు.

dead animals
మరణించిన పశువులు

By

Published : Jun 12, 2021, 4:30 PM IST

మరణించిన పశువుల వద్ద రోదిస్తున్న రైతులు

తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం గోల్‌బోడ్కతండా శివారు చర్లచంద్రుతండాకు చెందిన ఏడుగురు రైతులు, తమ పశువులను మేత కోసం సమీపంలోని వ్యవసాయ భూముల్లోకి తీసుకెళ్లారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్​ లైన్​ తీగలు తెగిపడ్డాయి. మేతమేస్తున్న క్రమంలో పశువులకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాయి.

అక్కడికక్కడే మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. వీటిలో ఐదు కాడెడ్లు, ఒక ఆవు, ఒక గేదె ఉన్నాయి. విషయం తెలుసుకున్న బాధిత రైతు కుటుంబాలు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. వాటిపై పడి రోధించిన తీరు అక్కడి వారందరినీ కంటతడి పెట్టించింది.

ఇదీ చదవండి:'పశుగ్రాస ఉత్పత్తి పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం'

ABOUT THE AUTHOR

...view details