కుటుంబ కలహాలతో గుంటూరు గోరంట్లలో ఓ మహిళ... తన తల్లి, చెల్లెలితో కలిసి భర్తను అంతమొందించింది. గోరింట్లలోని ఓ అపార్టుమెంట్లో వాచ్ మెన్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు హత్య కేసును ఛేదించిన నల్లపాడు పోలీసులు..... అతని భార్య రామలింగమమ్మ ప్రధాన నిందితురాలిగా తేల్చారు. రామలింగమ్మతోపాటు ఆమె తల్లి నాగేంద్రం, చెల్లెలు వీరమ్మను అరెస్టు చేశారు.
MURDER: తల్లి, చెల్లితో కలిసి భర్తను అంతమెుందించిన భార్య - CRIME NEWS IN GUNTUR
తల్లి, చెల్లెలుతో కలిసి ఓ మహిళ.... కట్టుకున్న భర్తనే చంపేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా గోరంట్లలో జరిగింది.

తల్లి, చెల్లితో కలిసి భర్తను అంతమెుందించిన భార్య
కేసుకు సంబంధించిన వివరాలను గుంటూరు దక్షిణ మండలం డీఎస్పీ జెస్సీ ప్రశాంతి మీడియాకు వెల్లడించారు. వాచ్ మెన్ వెంకటేశ్వర్లు నిద్రలో ఉండగా భార్యతోపాటు ఆమె తల్లి, చెల్లెలు అతని నోట్లో గుడ్డలు కుక్కి గొంతు చుట్టూ చున్నీ బిగించి హత్య చేసినట్లు వివరించారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు తరచూ గొడవలు, అనుమానంతో ఆమెను వేధించడం వంటి కారణాలతో ముగ్గురు మహిళలు వెంకటేశ్వర్లను హత్య చేసినట్లు డీఎస్పీ ప్రశాంతి వెల్లడించారు.
ఇవీ చదవండి