తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీగా పొడి గంజాయి(Ganja Seized in sattupally) పట్టుబడింది. ఏపీ నుంచి మహారాష్ట్రకు లారీలో తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. కోటీ నలభై రెండు లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి నుంచి మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు లారీ ట్రాలీ అడుగు భాగంలో ప్రత్యేకించి తయారు చేసిన బాక్స్‌లో 566 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితులు భాగస్వామమై ఉండగా.. ఇందులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారయ్యాడని.., తప్పించుకున్న వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.