విశాఖ అక్కయ్యపాలెం ఎన్జీజీవోస్ కాలనీలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు సమ్మేళనం జరిగింది. ఆ పాఠశాలలో 1994- 95 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల తిరిగి కలుసుకొని తమ మధుర స్మృతులను పంచుకున్నారు. ఆనాటి గురువులు వింజమూరి సుబ్రహ్మణ్యశర్మ, శిష్ట శారదాంబ, రెడ్డి సత్యంలను ఘనంగా సత్కరించారు. వీరంతా నేడు సమాజంలో విభిన్న వృత్తుల్లో, వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి ముచ్చట్లను పంచుకుంటూ ఫొటోలు దిగారు.
విశాఖ ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థుల కలయిక.. - Visakha Municipal High School old students meeting
విశాఖ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘం కలయిక వేడుకగా సాగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ గురువులను ఘనంగా సత్కరించారు.

పూర్వ విద్యార్థులు