కరోనా వైరస్ బాధితుల కోసం విశాఖలోని విమ్స్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సందర్శించారు. అక్కడి సౌకర్యాలు, వైద్య సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ప్రయాణికుడు క్వారంటైన్ పాటించాలని మంత్రి సూచించారు. విదేశీ ప్రయాణం చేసిన ప్రయాణికులు వైద్యులను సంప్రదించాలని కోరారు. కొద్దిపాటి నిర్లక్ష్యం వహిస్తే సమాజానికే ప్రమాదమని చెప్పారు. విశాఖలో రెండు వేల పడకలు సిద్ధం చేస్తునట్టు చెప్పారు. వైద్య సిబ్బంది సేవలను మంత్రి కొనియాడారు.
'కొద్దిపాటి నిర్లక్ష్యం... సమాజానికి ప్రమాదం'
విదేశాల నుంచి వచ్చేవారు స్వచ్ఛందంగా క్వారంటైన్లో ఉండాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోరారు. విశాఖ విమ్స్‌లో ఏర్పాటు చేసిన కరోనా క్వారంటైన్‌ను పరిశీలించిన ఆయన... అక్కడి సౌకర్యాలు బాగున్నాయని అన్నారు.
minister avanthi srinivasarao