నేరేడ్కో ప్రాపర్టీ షోకు వేదికగా.. విశాఖ
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నేరేడ్కో) ప్రాపర్టీ షోకు విశాఖ వేదిక కాబోతుంది. విశాఖ వి.కన్వెన్షన్ సెంటర్లో వచ్చే నెల 20 నుంచి 22 వరకు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు.
ఇప్పటి వరకు ప్రథమ శ్రేణి నగరాల్లోనే జరిగిన నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నేరేడ్కో) ప్రాపర్టీ షో... తొలి సారిగా విశాఖలో జరుగబోతోంది. ఇందుకు సంబంధించిన సన్నాహక కార్యక్రమం.. విశాఖలో నిర్వహించారు. నేరేడ్కో అధ్యక్షులు లహరి గ్రూప్ ఛైర్మన్ జి.హరిబాబు, ద్రోణంరాజు శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ కర్టెన్ రైజర్ ప్రారంభించారు. విశాఖలో ఇలాంటి కార్యక్రమం వల్ల ఒకే చోట వినియోగదారులకు కావలిసిన గృహాలు, బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉందని అన్నారు. వచ్చే నెల నిర్వహించన్ను ఈ కార్యక్రమంలో... వివిధ గృహ నిర్మాణ వస్తు సంస్థలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రాపర్టీ షో నిర్వహణతో విశాఖ వాసులకే కాకుండా... నగరాభివృద్ధికి దోహదపడుతుందని కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.