విశాఖ జిల్లా గాజువాక గాంధీనగర్లో రెండు రోజులుగా ఓ మొబైల్ నెట్వర్క్ చెందిన టవర్ను నిర్మిస్తున్నారు. 60 అడుగుల ఎత్తుగల సెల్ టవర్ను క్రేన్ సహాయంతో ఎత్తుతుండగా ప్రమాదవశాత్తు క్రేన్ అదుపుతప్పి పక్కకు ఒరిగింది. దీంతో టవర్ ఒక్కసారిగా పక్కనే ఉన్న ఖాళీ స్దలంలో పడిపోయింది. ఈ ఘటనలో పెనుప్రమాదం తప్పిందని.. మరోపక్కన పడిఉంటే ఆస్థి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేదని స్టానికులు అంటున్నారు.
సెల్ టవర్ ఎత్తుతుండగా అదుపుతప్పిన క్రేన్.. తప్పిన పెను ప్రమాదం - గాజువాక తాజా వార్తలు
విశాఖ గాజువాక గాంధీనగర్లో ప్రమాదం జరిగింది. సెల్ టవర్ నిర్మిస్తుండగా క్రేన్ అదుపుతప్పడం వల్ల ఆ టవర్ నేలకొరిగి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పడింది.

సెల్ టవర్ ఎత్తుతుండగా అదుపుతప్పిన క్రేన్