CM Jagan Visakhapatnam Tour: ఈనెల 17న విశాఖలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఎల్లుండి సాయంత్రం విశాఖ చేరుకోనున్న సీఎం జగన్..విశాఖ విమానాశ్రయంలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఎన్‌ఏడీ రోడ్డుపై వంతెన, ఆధునికీకరించిన ఉడా పార్కు, వీఎంఆర్‌డీఏ పనులు ప్రారంభించనున్నారు.
అనంతరం..నగరంలో జరిగే విజయనగరం డీసీసీబీ ఛైర్మన్ కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. అక్కడి నుంచి బయల్దేరి మధురవాడ వైజాగ్ కన్వెన్షన్‌లో జరగనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనుమరాలి వివాహ విందులో పాల్గొనున్నారు.