ముఖ్యమంత్రి జగన్ ఇవాళ అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం.. 10 గంటల 20 నిమిషాలకు విశాఖ ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీ సెజ్ వెళ్తారు. ఎపీ సెజ్‌లో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ సహా ఉత్పత్తులను సీఎం జగన్ ప్రారంభిస్తారు. మరికొన్ని పరిశ్రమలకు భూమిపూజ కార్యక్రమం చేయనున్నారు.
నేడు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన - సీఎం జగన్ తాజా వార్తలు
నేడు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి విశాఖ వెళ్లనున్న సీఎం..అచ్యుతాపురం ఏపీ సెజ్‌లో ఏటీసీ టైర్స్ కంపెనీ ప్రారంభించనున్నారు.
విశాఖ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన
మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు అక్కడి నుంచి విశాఖ బయలుదేరతారు. మధ్యాహ్నం ఒంటి గంట 10 నిమిషాలకు మర్రిపాలెం చేరుకుని, ఇటీవలే వివాహమైన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కుమారుడు సూర్య దంపతుల్ని ఆశీర్వదిస్తారు. అనంతరం విశాఖ నుంచి తిరుగు పయనమై తాడేపల్లి చేరుకుంటారు.
ఇవీ చూడండి