తెలుగుదేశం పార్టీ నేతలు, నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన శ్రేణులను అడ్డుకోవడమే కాకుండా... వారిపై కేసులు బనాయించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని చంద్రబాబు హెచ్చరించారు. ఇసుక సమస్యపై కొల్లు రవీంద్ర దీక్ష చేయబోతే... అక్కడా పోలీసులు అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'పోలీసులకు ఆ అధికారం ఎవరిచ్చారు..?'
రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై... తెదేపా అధినేత చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆక్షేపించారు.
చంద్రబాబు