ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 30, 2019, 7:49 PM IST

ETV Bharat / city

'టిడ్కోలో రివర్స్ టెండరింగ్​తో రూ.106 కోట్లు ఆదా'

టిడ్కో ద్వారా నిర్మిస్తున్న ఇళ్లకు రివర్స్ టెండరింగ్​తో డబ్బు ఆదా అయిందని... మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

bosta on tidco housing
bosta on tidco housing

బలహీన వర్గాల వారికి ప్రభుత్వం టిడ్కో ద్వారా నిర్మిస్తున్న 14 వేల 368 ఇళ్లకు... రివర్స్​ టెండరింగ్​తో ప్రభుత్వానికి రూ.106 కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రూ.707 కోట్లకు గానూ.. రూ.661 కోట్లకే టెండర్ వేసినట్టు వివరించారు. 430, 360, 300 చదరపు గజాల ఇళ్లను నిర్మిస్తున్నట్లు.. ఇందులో 300 చ.గ ఇళ్లను పూర్తి ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని బొత్స వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details