ఇకపై విజయవాడ రవాణాశాఖ కార్యాలయం నుంచి.. వాట్సప్ నెంబర్ ద్వారా సేవలందించాలని నిర్ణయం తీసుకున్నామని డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా.. లర్నింగ్ లైసెన్సులు, కొత్త డ్రైవింగ్ లైసెన్సుల జారీ నిలిపేసినట్టు చెప్పారు. అలాగే.. కొత్త లైసెన్సుల స్లాట్ బుకింగ్ లనూ నిలిపేశామన్నారు.
శాఖాపరమైన సమాచారం కోసం, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కొరకు, మెడికల్ సర్టిఫికెట్ల జారీ, సెకండ్ వెహికిల్ వెరిఫికేషన్, సీజ్ చేసిన వాహనాల విడుదల కోసం విజయవాడ డీటీసీ కార్యాలయానికి రాకుండానే వాట్సప్ నెంబరుకు తెలియజేస్తే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.