వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. రాష్ట్రంలో ఎంతమందికి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారో సమాధానం చెప్పాలని.. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి.. ఆయన లేఖ రాశారు.
"గత రెండేళ్ల కాలంలో ఎన్ని పెట్టుబడులు తెచ్చారు, రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలి. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి వేసిన బలమైన పునాదిని వైకాపా ప్రభుత్వం విస్మరిస్తోంది. దక్షిణ భారత దేశంలో అత్యధిక నిరోద్యగ రేటు ఉన్న రాష్ట్రంగా ఏపీ ఉండటం బాధ కలిగిస్తోంది. తక్కువ ఆదాయ రాష్ట్రాలకంటే రాష్ట్ర పరిస్థితి ఘోరంగా ఉంది." అని లేఖలో పేర్కొన్నారు.