పార్లమెంట్ ఆవరణలో తెదేపా ఎంపీల నిరసనలు కొనసాగుతున్నాయి. విభజన హమీలు నెరవేర్చాలని గాంధీ విగ్రహం సాక్షిగా ఆందోళన చేస్తున్నారు. మోదీ హాఠావో దేశ్ బచావో నినాదాలతో ధర్నా నిర్వహించారు.
అవంతి శ్రీనివాస్ ...
కేవలం ముఖ్యమంత్రిని విమర్శించటానికే భాజపా జాతీయ అధ్యక్షడు అమిత్ షా రాష్ట్రానికి వచ్చారు. విశాఖ రైల్వోజోన్ ను గురించి ప్రస్తావన లేకుండా సభ ముగించటం దారుణం. ఉత్తరాంధ్ర ప్రజల నమ్మకాన్ని మోసం చేశారు. ఇప్పటికైనా ధోరణి మార్చుకోవాలి లేదంటే రాష్ట్రంలో ఆ పార్టీ గల్లంతవుతుంది.
మురళీ మోహన్...
రాష్ట్రానికి విద్యాసంస్థలు కల్పించామని చెపుతున్నారు , ఇప్పటిదాకా ఆ సంస్థలకి ఎన్ని నిధులు కేటాయించారు. మీరు ఇచ్చిన డబ్బులు కనీసం ప్రహరీ గోడ కట్టడానికైనా సరిపోతుందా.... దేశంలోనే అత్యంత వేగంగా జరుగుతున్న పోలవరం ప్రాజెక్టుకి ఎన్ని నిధులు కేటాయించారు. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు.
కొనకళ్ల నారాయణ...
ఎలక్షన్ కమిషన్ అధికారులతో చర్చల విషయాన్ని ప్రతిపక్ష నాయకుడు ఎందుకు బహిర్గతం చేయలేదు. జగన్ తన డిమామండ్స్ ను గోప్యంగా ఉంచాల్సినవసరం ఏముంది.