ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 17, 2021, 12:26 PM IST

ETV Bharat / city

వైకాపా నేతల అక్రమాలకు ఏపీలోని జైళ్లు సరిపోవు: ధూళిపాళ్ల

రాజధాని భూముల్లో ఇన్​సైడర్ ట్రేడింగ్​పై తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇన్‌సైడర్​ ట్రేడింగ్‌ జరిగిందని పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేశారని అన్నారు. రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ లేదని హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు.

వైకాపా నేతల అక్రమాలకు ఏపీలోని జైళ్లు సరిపోవు: ధూళిపాళ్ల
వైకాపా నేతల అక్రమాలకు ఏపీలోని జైళ్లు సరిపోవు: ధూళిపాళ్ల

అమరావతిలో ఇన్​సైడర్​ ట్రేడింగ్ జరగలేదు అని హైకోర్టు 90 పేజీల నివేదిక ఇచ్చిందని ధూళిపాళ్ల నరేంద్ర చెప్పారు. బాధితులు ఫిర్యాదు చేయకుండా ఎమ్మెల్యే ఆళ్ల ఫిర్యాదు చేస్తే.. నోటీసులు ఇవ్వడం ఏంటని నిలదీశారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ శాఖ(సీఐడీ) కాస్త క్రిమినల్ ఇన్​ఫ్లూయెన్స్ డిపార్ట్​మెంట్​గా మారిందని విమర్శించారు. చంద్రబాబుపై పెట్టింది నూరుశాతం తప్పుడు కేసు అని పేర్కొన్నారు. వైకాపా నేతల అక్రమాలు బయటకు తీస్తే ఏపీలో ఉన్న జైళ్లు సరిపోవన్నారు. విశాఖలో అసైన్డ్ భూములు తీసుకోవచ్చు అని జీవో ఇచ్చిన సీఎంపై సీఐడీ కేసు ఎందుకు పెట్టడం లేదని ధూళిపాళ్ల నరేంద్ర నిలదీశారు. ఇళ్ల పట్టాల పేరుతో వేల ఎకరాల దళితుల భూమి లాక్కుంది వైకాపా ప్రభుత్వమని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్వేషపూరిత రాజకీయాలకు తెరలేపిందని విమర్శించారు. కొత్త జగన్నాటకానికి ఎమ్మెల్యే ఆళ్ల తెరలేపారన్న ధూళిపాళ్ల.. ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తే రేపు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details